1) రచయిత పెద్దింటి అశోక్ కుమార్ (2) ఆయన రాసిన జిగిరి, లాంగ్ మార్చ్ నవలల ముఖచిత్రాలు
బురుజు.కాం Buruju.com : Hyderabad: తెలంగాణ ఉద్యమం నేపథ్యంగా ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ‘లాంగ్ మార్చ్’ Long March నవలకు విశేష గౌరవం లభించింది. ఇది తెలంగాణలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఎంఎ రెండోవ సంవత్సరం విద్యార్ధులకు పాఠ్యాంశంగా ఎంపికయ్యింది. ఇప్పటికే ‘లాంగ్ మార్చ్’ నవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సిలబస్ గా కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ అంశాలను అధ్యయనం చేసేందుకు ఆశోక్ కుమార్ నవల తోడ్పడుతోంది.
రచయిత పెద్దింటి అశోక్ కుమార్ Peddinti Ashok Kumar రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకొంటుంటాయి. తెలంగాణలోని మట్టి జీవితాలను కథలు, నవలలు, నాటకాలు, సినిమాలుగా ఆవిష్కరిస్తూ ఆయన తన దైన ముద్రను వేసుకొన్నారు. మానవ సంబంధాలపై ఆయన రాసిన ‘జిగిరి’ నవల హింది, మరాఠి, ఒరియా, పంజాబి, బెంగాలి, తమిళం, ఇంగ్లీషు తదితర 12 భాషల్లోకి అనువాదమయ్యి ఆయా చోట్ల వివిధ కళాశాలల్లో సిలబస్ గా ఉంది. దీనిని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నల్గొండలోని నాగార్జున కళాశాల విద్యార్ధులకు పాఠ్యాంశంగా పెడుతున్నారు.
ఎంఎ సిలబస్ గా తాజాగా ఎంపికైన ‘లాంగ్ మార్ఛ్’, వివిధ భాషల్లోకి అనువదించిన ‘జిగిరి’ నవలలు త్వరలో సినిమాలుగానూ రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అశోక్ కుమార్ సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.