దాదాపు పది వేల సంవత్సరాల క్రితం కోకాపేట గుట్టలపై ఆదిమానవులు పై చిత్రంలోని మాదిరిగానే నివసించేవారు. వేటలో తాము చూసిన జంతువుల బొమ్మలను తమ తీరిక సమయాల్లో తమ గుహల్లోని రాళ్లపై గీసేవారు. పై చిత్రంలో ఒక వ్యక్తి ఇలా ఒంటెలా కనిపిస్తున్న జంతువు బొమ్మను గీస్తుండటం చూడవచ్చు. కోకాపేట గుట్లలపైనా ఇటువంటి జంతువుల బొమ్మలనే అప్పట్లో చిత్రించారు
పై ఫొటో గత ఏడాది తీసింది. దీనిలో కుడివైపు కనిపిస్తున్న గుట్ట విశాలంగా పైకి ఎక్కేందుకు అనువుగా ఉండేది. ఒకప్పుడు ఇది ఆది మానవుల ఆవాసం. దీనిపైన వారు గీసిన చిత్రాలు ఉండేవి. లేఅవుట్ కోసం హెచ్.ఎం.డి.ఎ, ఆ తర్వాత భవనాల నిర్మాణం కోసం బిల్డర్లు ఇక్కడి రాళ్ల గుట్టలన్నీ కొట్టి వేశారు. చారిత్రక సంపద ఉందని తెలిసినా కాసుల కోసం ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభించింది
గుట్టలన్నీ కొట్టి వేసి ఇలా రోడ్లను వేసి లేఅవుట్ గా మార్చేశారు
పురావస్తు పరిశోధకులు కృష్ణ శాస్త్రి 40 ఏళ్ల క్రితం కోకాపేట గట్టలపైకి ఎక్కి ఆక్కడ ఆదిమానవుడు గీసిన చిత్రాల ఫొటోలను తీశారు. ఆ ఫొటోలను 1983లో వెలువరించిన తన ఒక గ్రంధంలో ముద్రించారు. గ్రంధంలోని ఒక ఫొటో ఇది
