Buruju News logo
  • News

  • About Us

  • Contact Us

  • Search

  • Twitter

పట్టాభిషేక సమయంలో రాణి రుద్రమ దేవి ఇలాగే ఉన్నారా?
personBuruju Editor date_range2025-04-04
{{resdata.image_caption1} 1) భారత పురావస్తు శాఖ (ఎ.ఎస్.ఐ) విశ్రాంత అధికారి దిట్టకవి కన్నబాబు (2) ఖమ్మం జిల్లా తీర్ధాలలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో గల రుద్రమదేవి శిల్పం

బురుజు.కాం Buruju.com : Hyderabad: కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమ దేవి జీవించి ఉన్నప్పుడు చెక్కిన ఆమె శిల్పాలు ఇటీవల కాలంలో అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. ఖమ్మం జిల్లా తీర్ధాలలోని సంగమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గల రెండు శిల్పాల్లో ఉన్నది రుద్రమ దేవేనని ఇటీవల వెల్లడయ్యింది. కేంద్ర పురావస్తు శాఖ Archaelogy Survey of India (ASI) విశ్రాంత ఉన్నతాధికారి దిట్టకవి కన్నబాబు అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి రుద్రమ దేవికి పట్టాభిషేకం జరిగినప్పుడు ఈ శిల్పాలను చెక్కి ఉండొచ్చని ధృవీకరించారు. తలపై కిరీటంతో తన ఇష్ట దైవమైన ఈశ్వరుడిని స్మరిస్తున్నట్టుగా ఒక శిల్పంలో ఆమె కనిపిస్తుండగా.. ఆలయానికి ఆమె ఏనుగుపై వచ్చినప్పుడు అక్కడి సామంతరాజు దంపతులు స్వాగతం పలుకుతున్నట్టుగా మరో శిల్పం చెక్కి ఉంది. తాజా పరిశోధనలపై Buruju.com అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

శిల్పాలు ఉన్న ఖమ్మం జిల్లా తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం శిల్పాలు ఉన్న ఖమ్మం జిల్లా తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం

కాకతీయులు అత్యంత జనరంజికంగా పరిపాలించారని చెప్పేందుకు వారు తవ్వించిన భారీ చెరువులు, అద్భుత శిల్పాలతో వినూత్నంగా నిర్మించిన రామప్ప వంటి ఆలయాలు ఇప్పటికీ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. తండ్రి గణపతి దేవుడి అనంతరం రాజ్యభారాన్ని స్వీకరించిన రుద్రమ దేవి Rani Rudrama Devi క్రీ.శ.1262 నుంచి 1289 వరకు పరిపాలించింది. కేంద్ర పురావస్తు శాఖలో 34 ఏళ్ల పాటు పనిచేసి కాకతీయులకు సంబంధించి పలు విషయాలను వెలుగులోకి తెచ్చిన దిట్టకవి కన్నబాబు Dittakavi Kannababu తన పదవీ విరమణ తర్వాత కూడా పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఖమ్మం జిల్లా తీర్ధాల Teerdhala గ్రామంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలోని రెండు శిల్పాల్లో రాణి రుద్రమదేవి ఉన్నట్టు ఆయన తాజాగా బయటపెట్టారు. అక్కడ ఆకేరు, మున్నేరు, బుగ్గేరు అనే ఉప నదులు కలుస్తాయి. అది త్రివేణి సంగమ ప్రాంతం కావటంతో కర్మకాండలు నిర్వహించేవారు ఎక్కువగా వెళ్తుంటారు. సంగమేశ్వర స్వామి ఆలయ వాస్తు అంశాల పరిశీలన కోసం వెళ్లిన కన్నబాబు అక్కడి రెండు శిల్పాలను చూసి ఆశ్చర్యపోయారు.

ఆలయానికి  ఏనుగుపై వస్తున్న రుద్రమదేవి, ఆమెకు స్వాగతం పలుకుతున్న సామంత రాజు దంపతును చెక్కిన శిల్పం ఆలయానికి ఏనుగుపై వస్తున్న రుద్రమదేవి, ఆమెకు స్వాగతం పలుకుతున్న సామంత రాజు దంపతును చెక్కిన శిల్పం

ఇదే విషయాన్ని ఒక పత్రికకు వెల్లడించగా ఆ శిల్పంలో ఉన్నది రుద్రమదేవి కాదంటూ కొందరు చరిత్రకారుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా కన్నబాబు Buruju.com ప్రతినిధితో మాట్లాడుతూ ఆ శిల్పాల్లో ఉన్నది ముమ్మాటికి రుద్రమ దేవేనని తేల్చిచెప్పారు. ఆయన ఇలా వివరించారు.. ‘‘ ఆహర్యం బట్టి చూస్తే.. రుద్రమ దేవి పట్టాభిషేకం సమయంలో ఎటువంటి ఆభరణాలను, దస్తులను ధరించి ఉందో వాటితోనే ఆలయానికి వచ్చింది. అందుకే శిల్పి వాటన్నింటిని గ్రానైట్ ఫలకంపై చిత్రీకరించాడు. ముంజేతికి కంకణాలు, సొంపైన కర్ణాభరణాలు, ముత్యాల కంఠహారం ఒంటిపై ఉన్నాయి. ఆ కాలపు రాణి ధరించే ఉన్నతమైన రవికను పై భాగంలోను, సౌకర్యవంతమైన మేని వస్త్రం నడుము నుంచి దిగువ వరకు కనిపిస్తున్నాయి. నడుము చుట్టూ బిగుతుగా రాజసం ఉట్టిపడే వడ్డాణం ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా మహోన్నతమైన రాజకిరీటం ఆమె హుందాతనాన్ని, రాజసాన్ని, గాంభీర్యాన్ని తెలియజేస్తోంది. సామాన్యులకు ఇవన్నీ ధరించటం ఎంతమాత్రం సాధ్యంకాదు. నా అంచనా ప్రకారం ఈ శిల్పం తొలుత సంగమేశ్వరుని Sangameswara Swami ఎదురుగా ముఖ మండపంలో నిలిపి ఉండొచ్చు. పరిణామక్రమంలో అది ఆలయం బయట ప్రస్తుత స్థానానికి చేరింది. ఎండకు ఎండి, వానకు తడవటం వల్ల ఆమె ధరించిన రక్షణ కవచం సరిగ్గా కనిపించటం లేదు’’ అని కన్నబాబు పేర్కొన్నారు.

రుద్రమదేవి పరిపాలన కేంద్రమైన వరంగల్ కోట ముఖద్వారం రుద్రమదేవి పరిపాలన కేంద్రమైన వరంగల్ కోట ముఖద్వారం

అక్కడే ఆలయం వెనుక భాగంలో ఉన్న మరో శిల్పం కూడా రుద్రమ దేవిదేనని కన్నబాబు వెల్లడించారు. ‘‘సంగమేశ్వరుని దర్శనం కోసం ఆలయానికి పట్టపుటేనుగుపై వచ్చినట్టుగా ఆ శిల్పం చెబుతోంది. స్థానిక సామంత రాజు ఒకరు భార్య సమేతంగా ఎదురేగి మహారాణిని ఆహ్వానిస్తున్నట్టుగా శిల్పాన్ని చెక్కారు. ఇక్కడి రెండు శిల్పాలు కూడా మహోతన్నమైనవి’’ అని ఆయన వివరించారు. ఆ శిల్పాలను పరిశీలించకుండానే విమర్శలు చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని కన్నబాబు పేర్కొన్నారు. కొందరు చరిత్రకారుల అంచనా ప్రకారం.. రుద్రమదేవి తనకు ఎదురు తిరిగిన సామంత రాజు అంబదేవుడితో 82 ఏళ్ల వయస్సులో యుద్ధం చేస్తూ క్రీశ. 1289లో చనిపోయింది. యుద్ధ సన్నవేశ శిల్పాన్ని కరీంనగర్ జిల్లా ఆలయంలో కన్నబాబే కనుగొన్నారు.

Tags:చలన చిత్రంStory

Recent Posts:

అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను  కాపాడిన  తెలుగు అధికారి
అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను కాపాడిన తెలుగు అధికారి
బురుజు.కాం Buruju.com భారత్ లో రాకెట్ ప్రయోగాలకు భీజం వేసింది.. ఇస్రో శాస్త...
చలన చిత్రం
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు?  ( అయిదో భాగం)
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు? ( అయిదో భాగం)
బురుజు.కాం Buruju.com : ( అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొ...
చారిత్రకం
మూడు పార్టీలకు  చెమటలు పట్టించనున్న మునుగోడు
మూడు పార్టీలకు చెమటలు పట్టించనున్న మునుగోడు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో త్వరలోనే మళ్లీ ఎన్నికల వేడి రాజకోబోతోంది...
అవీ ఇవీ
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత లక్ష్యం మారిపోతోంద...
సామాజికం
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
బురుజు.కాం Buruju.com : జాతీయ ప్రణాళిక సంఘం రద్దయినప్పటి నుంచి రాష్ట్రాల ...
ఆర్థికం
గవర్నరు  ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
గవర్నరు ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
బురుజు.కాం Buruju.com : ఎవరైనా కలత చెందుతున్నప్పుడు వారిని అర్ధం చేసుకొన...
అవీ ఇవీ
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
బురుజు.కాం Buruju.com : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు రాష్ట్రాలుగా వ...
అవీ ఇవీ
తెలంగాణలో వరద రాజకీయం
తెలంగాణలో వరద రాజకీయం
బురుజు.కాం Buruju.com : రాష్ట్రాల్లో వరదలు, తుపానులు ఎప్పుడొచ్చినా రాజకీయాల...
అవీ ఇవీ
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
బురుజు.కాం Buruju.com : వ్యభిచారాన్నీ ఒక వృత్తిగా గుర్తించి తమను ఇతరులతో స...
చలన చిత్రం
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
(పిళ్లా సాయికుమార్: Buruju.com) ( విజయనగరంలో 1988లో మృతి చెందిన నిజాయితీ ...
రిపోర్టర్ డైరీ
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
బురుజు.కాం ( Buruju.com) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇక బ్యాంకింగ్ సేవల...
ఆర్థికం
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
బురుజు.కాం Buruju.com : సామాన్యుడికి అండగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పి ...
చలన చిత్రం
అల్లూరిని హతమార్చిన  పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ?  (నాలుగో భాగం)
అల్లూరిని హతమార్చిన పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ? (నాలుగో భాగం)
బురుజు.కాం Buruju.co ప్రతినిధి: (అల్లూరి సీతారామరాజు తమ అధీనం నుంచి తప్ప...
చారిత్రకం
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
సగటు ఆయుర్దాయం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు వెల్లడయ...
అవీ ఇవీ
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
బురుజు.కాం ప్రతినిధి Buruju.com : ఒోవర్ డ్రాఫ్టు కింద రిజర్వు బ్యాంకు నుం...
ఆర్థికం
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
బురుజు.కాం Buruju.com : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చ...
చలన చిత్రం
About

Buruju.com, the online telugu portal brings you weekly news and views mainly focusing on Social, Financial and Historical events of Andhra Pradesh and Telagana states from Hyderabad, India.

Contact
For Editorial feedback and Marketing Contact:
editor@buruju.com
Quick Links
  • About Us
  • Contact Us
  • Search Buruju

Copyright © 2020 All Rights Reserved by Buruju. Contents of ‘Buruju.com’ are copyright protected. Copy or reproduction or re use of contents or any part thereof is illegal. Such persons will be prosecuted.