Buruju News logo
  • Home

  • About Us

  • Feedback

  • Search

  • Twitter

ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంటు అలా వచ్చింది! ( సచివాలయం భేష్.. జర్నలిస్టుల పూర్వ వైభవం మాటేమిటి?-మూడో భాగం)
personBuruju Editor date_range2023-01-01
{{resdata.image_caption1}42 రోజుల సకలజనుల సమ్మె సమయంలో నిర్వహించిన సమావేశం ఇది. టీఎన్జీవోల సంఘం నాయకులు దేవీ ప్రసాద్, స్వామి గౌడ్, కారం రవీందర్ రెడ్డి ఇంకా వివేక్ తదితరులు చిత్రంలో ఉన్నారు

బురుజు.కాం Buruju.com : (తెలంగాణ సచివాలయ భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. 2023, జనవరి నుంచి అక్కడకు వెళ్లి విధులను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. నూతన సచివాలయంలో మునుపటి మాదిరిగా అధికారులను, మంత్రులను కలవగలిగే స్వేచ్ఛ తమకు ఉంటుందా? అనే సందేహాలు విలేకర్లలో గూడుకట్టుకొన్నాయి. అసలు.. పాత సచివాలయంలో వార్తా సేకరణ ఎలా ఉండేది వివరిస్తూ రాస్తున్న కథనాల్లో ఇది మూడోవది) ఉభయ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు పదో పీఆర్సీ ఒక వర ప్రసాదమనే చెప్పాలి. ఎందుకంటే .. మూల వేతనంలో పెంపు (ఫిట్మెంటు)ను పదో వేతన సవరణ సంఘం Pay revision commission 29 శాతం మేర సిఫార్సు చేయగా.. తెలంగాణ ప్రభుత్వం దాన్ని 43 శాతానికి పెంచింది. తెలంగాణలో ఇలా ఇవ్వటంతో.. ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదే రీతిలో అక్కడి ఉద్యోగులకూ మంజూరు చేశారు. అప్పట్లో 43 శాతం మేర పెంపునకు తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద తీవ్రంగా అభ్యంతరం పెట్టిన సంగతి చాలమందికి తెలియదు. సచివాలయంలోని ఆనాటి విషయాలను ‘బురుజు’ ఇప్పుడు బహిర్గతం చేస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు.. పీఆర్సీ ఛైర్మన్లను సైతం కలసి వివరాలను రాబట్టగలిగే అవకాశాలు విలేకర్లకు ఉండేవి.

వేతన సవరణ కమిషనరుతో ఉద్యోగ సంఘాల భేటీలు, సిఫార్సులకు ఆమోద ముద్ర పడిన తర్వాత జోవోల జారీ వంటి ప్రక్రియలన్నీ పాత సచివాలయంలోని  ‘డి’ బ్లాకులోనే చోటు చేసుకొనేవి (చిత్రంలో కనిపిస్తున్న భవనం)వేతన సవరణ కమిషనరుతో ఉద్యోగ సంఘాల భేటీలు, సిఫార్సులకు ఆమోద ముద్ర పడిన తర్వాత జోవోల జారీ వంటి ప్రక్రియలన్నీ పాత సచివాలయంలోని ‘డి’ బ్లాకులోనే చోటు చేసుకొనేవి (చిత్రంలో కనిపిస్తున్న భవనం)

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఇక్కడి ఉద్యోగులు 42 రోజుల పాటు ‘సకల జనుల సమ్మె’ పేరుతో ఉద్యమాన్ని నిర్వహించారు. సమ్మెకాలం 42 రోజులైనందున అంతటి స్థాయిలో ఫిట్మెంటు కావాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెచ్చేది. ఆర్థిక శాఖ మాత్రం.. పెంపు అనేది 30 శాతం లోపు ఉంటేనే వివిధ పథకాలను సక్రమంగా అమలు చేసుకోగలుగుతామనే ధోరణిలో ఉండేది. అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శి రామకృష్ణారావు.. దీనిపై పలు విడతలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యి.. ఇప్పుడు పెంపు ఎక్కువగా ఉంటే భవిష్యత్తు పీఆర్సీల్లో అంతకంటే ఎక్కువగా ఫిట్మెంటును ఉద్యోగులు కోరతారని, ఇదంతా కొత్త రాష్ట్రానికి భారంగా పరిణమిస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి.. ఉద్యోగులు అడుగుతున్నట్టుగా 42 శాతం మేర ఇవ్వాలనే ధోరణినే ఆర్థిక శాఖ అధికారుల వద్ద కనబరస్తూ వచ్చేవారు. సరిగ్గా ఇదే సమయంలో.. ‘ఈనాడు’లో ఒక కథనం వెలువడింది..

నూతన సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక ఇలా కనిపిస్తుందినూతన సచివాలయం నిర్మాణం పూర్తయ్యాక ఇలా కనిపిస్తుంది

అదేమిటంటే.. ఉద్యోగులు 42 శాతానికి బదులుగా 43 శాతం కనుక పొందగిలితే ఆ ఒక్క శాతం పాయింటుతోనే పలువురికి వేతనాలు బాగా పెరగగలుగుతాయనేది ఆ కథనం సారాంశం. ప్రస్తుత మూల వేతానికి అనుగుణంగా.. మాస్టర్ స్కేలులోని స్టేజీల వద్ద ఉద్యోగిని కూర్చోపెట్టేటప్పుడు ఒక్క శాతం పాయింటుతోనే తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయని కథనంలో తెలపటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నేతలు దీనిపై అధ్యయనం చేశారు. అంతవరకు వారు 42 శాతాన్ని కోరుతూ వచ్చినప్పటికీ.. 43 శాతమే ఎక్కువ మందికి ప్రయోజనకారిగా ఉంటుందని వెల్లడైన తర్వాత.. అప్పటి టీన్జీవోల సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్.. తదితరులు అదే విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించగలిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పట్లో రోజూ సచివాలయానికి వస్తుండేవారు. ఆయన 2015,జనవరి 5వ తేదీన ఉద్యోగ సంఘాల నేతలతో అక్కడే ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ వెంటనే విలేకర్లను పిలిచి.. ఫిట్మెంటును 43 శాతం మేర ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన ఇంతటి స్థాయిలో మంజూరు చేయటం ఉద్యగులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. పదో పీఆర్సీ సిఫార్సులు 3013 జూలై నుంచి 2018 జూన్ వరకు అయిదేళ్లు అమలయ్యాయి.

ముఖ్యమంత్రికి పుష్కగుచ్ఛాన్ని అందజేస్తున్న నాటి ఉద్యోగుల నేతలుముఖ్యమంత్రికి పుష్కగుచ్ఛాన్ని అందజేస్తున్న నాటి ఉద్యోగుల నేతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం భవనాలను రెండు రాష్ట్రాల వారికి పంచి.. మధ్యలో ఒక ముళ్ల కంచెను ఏర్పాటు చేయటంతో.. తెలంగాణ ఫిట్మెంటు ప్రకటన నాటికి ఏపీ సచివాలయం ఇక్కడే ఉంది. అనంతరం నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 43 శాతం ఫిట్మెంటు ఇచ్చి అక్కడి ఉద్యోగులనూ సంతోషపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే తమకు ఫిట్మెంటును ఇవ్వాలంటూ తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు వారం రోజుల పాటు సమ్మెచేయగా.. 2015, మే 13వ తేదీన వారికి 44 శాతం ఫిట్మెంటును మంజూరు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించి.. వారినీ ఆశ్చర్యపర్చారు. అప్పట్లో సచివాలయంలో.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కలసి తాజా వివరాలను తెలుసుకొనే అవకాశాలు విలేకర్లకు ఉండేవి. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. దీనికి కరోనా తోడయ్యింది. కరోనా సమయంలో అధికారులకు, విలేకర్లకు మధ్య సంబంధాలు తగ్గిపోయాయి . ఇదే సమయంలో.. పాత సచివాలయ భవనాలను కూల్చివేసి.. కార్యాలయాలను భూర్గుల రామకృష్ణారావు భవనాల్లోకి తరలించాక విలేకర్లపై ఆంక్షలు ఎక్కువయ్యాయి(నాలుగో భాగం వచ్చేవారం)

Tags:రిపోర్టర్ డైరీStory

Recent Posts:

అన్నమయ్య కీర్తనల్లోని ‘గుబ్బల గుట్ట’.. ఇక అంతర్ధానం కావాల్సిందేనా?
అన్నమయ్య కీర్తనల్లోని ‘గుబ్బల గుట్ట’.. ఇక అంతర్ధానం కావాల్సిందేనా?
బురుజు.కాం Buruju.com : వందల సంవత్సరాల కిత్రం కవులు తమ కావ్యాల్లో వర్ణించిన...
గ్రామీణం
గవర్నరు-ప్రభుత్వం మధ్య వివాదం మరింత తీవ్రం
గవర్నరు-ప్రభుత్వం మధ్య వివాదం మరింత తీవ్రం
బురుజు.కాం Buruju.com : సమసిపోయిందని భావించిన తెలంగాణ గవర్నరు, ప్రభుత్వం మధ...
అవీ ఇవీ
తెలంగాణలో కస్తూర్బా విద్యాలయాల సంఖ్య ఘనం.. సిబ్బంది వేతనాలు మాత్రం హీనం
తెలంగాణలో కస్తూర్బా విద్యాలయాల సంఖ్య ఘనం.. సిబ్బంది వేతనాలు మాత్రం హీనం
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV)...
ఉద్యోగం
తెలంగాణ  రెండో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయండి
తెలంగాణ రెండో పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయండి
బురుజు.కాం Buruju.com : తెలంగాణ ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించిన సిఫార్...
ఉద్యోగం
జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు
జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు
బురుజు.కాం Buruju.com : హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీలోని ...
అవీ ఇవీ
అంగనవాడీ ఉద్యోగులను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ గుర్తించాలి
అంగనవాడీ ఉద్యోగులను ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణ గుర్తించాలి
బురుజు.కాం Buruju.com : మహిళ, శిశు సంక్షేమంలో అంగనవాడీ ఉద్యోగుల పాత్ర బాగా ...
ఉద్యోగం
జమ్మూ కాశ్మీర్ సరసన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ !!
జమ్మూ కాశ్మీర్ సరసన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ !!
బురుజు.కాం Buruju.com : క్రమం తప్పకుండా ప్రతి నెల ఓవర్ డ్రాఫ్టు కోసం వస్తు...
ఆర్థికం
తెలంగాణ పింఛనుదారులకు అందనున్న 6 శాతం వడ్డీ
తెలంగాణ పింఛనుదారులకు అందనున్న 6 శాతం వడ్డీ
బురుజు.కాం Buruju.com : తెలంగాణలోని ప్రభుత్వ పింఛనుదారులకు government pensi...
ఉద్యోగం
పాపన్న చరిత్రలోని నిజాల నిగ్గుతేల్చలేమా? (  మొదటి భాగం)
పాపన్న చరిత్రలోని నిజాల నిగ్గుతేల్చలేమా? ( మొదటి భాగం)
బురుజు.కాం Buruju.com : సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతిలను ఇక అధికారికంగా ని...
చారిత్రకం
‘లైర్ ’ సినిమాలో మాదిరిగా..  మరెన్నో రూపాల్లో జీవాయుధాలు
‘లైర్ ’ సినిమాలో మాదిరిగా.. మరెన్నో రూపాల్లో జీవాయుధాలు
బురుజు.కాం Buruju.com : దేశాల మధ్య యుద్ధాలు మున్ముందు కొత్త రూపాలను సంతరించ...
చలన చిత్రం
వెయ్యేళ్ల క్రితం నాటి ఆలయంపై టోపీ వాలా ఎవరబ్బా?
వెయ్యేళ్ల క్రితం నాటి ఆలయంపై టోపీ వాలా ఎవరబ్బా?
మన్నేపల్లి విజయ సారథి Buruju.com : వెడల్పైన టోపీ, మోచేతుల వరకు టీషర్టు ధర...
అవీ ఇవీ
దేశం కోసం పోరాడిన వారు నిరసన  దీక్షల్లో కూర్చోవటమేమిటి?
దేశం కోసం పోరాడిన వారు నిరసన దీక్షల్లో కూర్చోవటమేమిటి?
బురుజు.కాం Buruju.com : దేశం కోసం పోరాడిన వారు ధర్నాలు, నిరసన దీక్షలు చేయ...
అవీ ఇవీ
తిరుమలలో మాదిరి భోజన విరాళ పథకాన్ని.. పాఠశాలల్లోను అమలు చేయొచ్చు
తిరుమలలో మాదిరి భోజన విరాళ పథకాన్ని.. పాఠశాలల్లోను అమలు చేయొచ్చు
బురుజు.కాం Buruju.com : తిరుమలలో Tirumala తాజాగా ప్రవేశపెట్టిన భోజన విరాళ ...
ఆదర్శం
మరో పీఆర్సీ వచ్చేస్తున్నా ‘ఉపాధి’ క్షేత్ర సహాయకుల జీతం పెరగలేదు (మూడో భాగం)
మరో పీఆర్సీ వచ్చేస్తున్నా ‘ఉపాధి’ క్షేత్ర సహాయకుల జీతం పెరగలేదు (మూడో భాగం)
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో రెండో పీఆర్సీ ఏర్పాటు గడువు సమీపిస్తుండగ...
ఉద్యోగం
వరంగల్ కోట శిథిలాల్లో కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ దేవి ! (రెండవ భాగం)
వరంగల్ కోట శిథిలాల్లో కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమ దేవి ! (రెండవ భాగం)
బురుజు.కాం Buruju.com : (డావిన్సీ గీసిన మోనాలిసా చిత్తరువుపై ప్రపంచ వ్యాప...
చారిత్రకం
తెలంగాణలో ఎస్టీ కమిషన్ ద్వారానే ‘పోడు’కు అంతిమ పరిష్కారం
తెలంగాణలో ఎస్టీ కమిషన్ ద్వారానే ‘పోడు’కు అంతిమ పరిష్కారం
బురుజు.కాం Buruju.com : ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణలో ఎస్టీ కమ...
అవీ ఇవీ
About

Buruju.com, the online telugu portal brings you weekly news and views mainly focusing on Social, Financial and Historical events of Andhra Pradesh and Telagana states from Hyderabad, India.

Contact
For Editorial feedback and Marketing Contact:

editor@buruju.com

Quick Links
  • About Us
  • Contact Us
  • Search Buruju
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Copyright © 2020 All Rights Reserved by Buruju. Contents of ‘Buruju.com’ are copyright protected. Copy or reproduction or re use of contents or any part thereof is illegal. Such persons will be prosecuted.