Buruju News logo
  • News

  • About Us

  • Contact Us

  • Search

  • Twitter

భక్త రామదాసు ఏమయ్యారు? ( మొదటి భాగం)
personBuruju Editor date_rangeFri Mar 27 2026 00:00:00 GMT+0530 (India Standard Time)
{{resdata.image_caption1} భక్త రామదాసు రాసినట్టుగా జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కీర్తనల ఆధారంగానే పరిశోధకులంతా కథనాలను అల్లారే తప్ప ఇతర ఆధారాల కోసం ఇంత వరకు పెద్దగా ప్రయత్నించలేదు

బురుజు.కామ్ Buruju.com : Hyderabad: ( భద్రాచలం రాముడు స్పురణకు రాగానే భక్త రామదాసు గుర్తుకొస్తారు. భక్త రామదాసుకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాల్లో చాలా వాటికి ఇప్పటికీ చారిత్రక ఆధారాలు లభించలేదు. భద్రాచలం ఆలయాన్ని యాదాద్రి మాదిరిగా తీర్చిదిద్దుతామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం.. భక్త రామదాసు చెందిన వాస్తవాల వెల్లడికీ నడుం కట్టాలి. భక్త రామదాసు ఏమయ్యిందీ చారిత్రక కోణంలో పరిశీలించి బురుజు.కామ్ అందిస్తున్న కథనాల్లో ఇది మొదటిది) భక్త రామదాసు గోల్కొండ చెరశాల నుంచి విడుదలయ్యాక భద్రాచలంలో శేషజీవితాన్ని గడిపారనటానికి సాక్ష్యాలు కొరవడ్డాయి. మెఘల్ పాలకుల ఆగడాలతో ఆయన కుటుంబ సభ్యులతో సహా అదృశ్య‌మ‌య్యారనేది ఒక వాదన. ఆయన గోల్కొండ బంధీఖానాలోనే చనిపోయారని.. గోల్కొండ కోటను ఔరంగజేబు స్వాధీనం చేసుకొన్నప్పుడు మిగతా ఖైదీలతో పాటు భక్త రామదాసునూ విడిచిపెట్టారని.. వంటి సూత్రీకరణలు గ్రంధాల్లో కనిపిస్తున్నాయి. భక్త రామదాసు రాయించినట్టుగా చెప్పే శాసనం అప్పట్లోనే ధ్వంసమయ్యింది. ఆయన ఉనికికి చెందిన చారిత్రక ఆధారాలు లభించకపోవటం వల్లనే వివాదాస్పద అంశాలు తలెత్తుతున్నాయి.

రామదాసును బంధించినట్టుగా చెప్పే గోల్కొండ కోటలోని సామాగ్రిని భద్రపరిచే గది రామదాసును బంధించినట్టుగా చెప్పే గోల్కొండ కోటలోని సామాగ్రిని భద్రపరిచే గది

భక్త రామదాసుకు Bhakta Ramadasu సంబంధించి జనబాహుళ్యంలో ఉన్న కథలే ప్రస్తుతానికి ప్రామాణికమై ఉన్నాయే తప్ప ఎటువంటి పత్రాలు, శాసనాలు ఇంతవరకు కనిపించనేలేదు. ప్రాచ్యలిఖిత పత్రాల బండాగారాల్లో నాటి రెవెన్యూ రికార్డులు లక్షల సంఖ్యలో గుట్టలుగా పడి ఉన్నందున వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే తప్పకుండా కొన్ని ఆధారాలు లభించొచ్చు. ప్రఖ్యాత చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన వ్యాసాల్లో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ. . ఆనాడు తానీషాకు నిజంగా పైకం తిరిగి అందివుంటే ఆ విషయం రికార్డుల్లో తప్పకుండా లిఖించి ఉంటుందని పేర్కొన్నారు. అసలు అప్పట్లో ఖైదీల కోసం గోల్కొండ సమీపంలోని అశుర్ఖానా పక్కన చెరశాల ఉండేది. రామదాసును అక్కడ కాకుండా.. రాజప్రాసాదాల సమీపంలోని ధనాగారం భవనం కింద సామాగ్రిని భ్రద్రపర్చే గదిలో ప్రత్యేకంగా ఉంచినప్పుడు.. మళ్లీ చిత్ర హింసలు పెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చినట్టు? వంటి సందేహాలూ నివృత్తి కావాల్సివుంది.

భక్త రామదాసు విగ్రహం భక్త రామదాసు విగ్రహం

భక్త రామదాసుకు చెందిన చారిత్రక సత్యాల కోసం 1920లో ఎంతో ఉత్సాహంగా భద్రాచలం ఆలయానికి వెళ్లిన అప్పటి పురావస్తు శాఖ సహాయక సూపరింటెండెంట్ వెంకోబారావు.. అక్కడ అటువంటివేమీ లభించక తీవ్ర నిరాశ చెందారు. చరిత్రకారుడు జాదూనాథ్ సర్కార్.. 1919లో తాను పర్షియన్ పత్రాలను అధ్యయనం చేసి రాసినట్టుగా ప్రకటించిన ‘ఔరంగజేబు చరిత్ర’లో.. కంచెర్ల గోపన్నఇతివృత్తం వద్దకు వచ్చేసరికి మాత్రం జనం నోళ్లలో నానుతున్న కథనే చెప్పి మిన్నకున్నారు. రామదాసుకు చెందిన చారిత్రక అంశాలను తెలుసుకొనేందుకు ‘బురుజు’ ప్రతినిధి కొన్ని గ్రంధాలు, నివేదికలను పరిశీలించినప్పుడు.. చాలా వాటిలో సాక్ష్యాలు అంటూ లేని కథనాలే కనిపించాయి. భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ).. 1954లో ‘గోల్కొండ’ పేరుతో వెలువరించిన నివేదికలోను రామదాసు చారిత్రకతను నిరూపించలేదు .

భద్రాచలం ఆలయం భద్రాచలం ఆలయం

ఇంతవరకు వెలువడ్డ వాటిలో వెంకోబారావు నివేదిక మాత్రమే కొంత పరిశోధనతో కూడుకొనివుంది. ఆ తర్వాత కొన్ని గ్రంధాలకు ఆయన నివేదికే ప్రధాన వనరుగా ఉంటూ వచ్చింది. పురావస్తు శాఖ అధికారి వెంకోబారావు 1920 , జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అప్పటికే జనం చెప్పుకొంటున్న భక్త రామదాసు కథకు ఆధారాల కోసం భద్రాచలం ఆలయానికి వెళ్లారు. అక్కడ 17వ శతాబ్ధానికి చెందిన భక్త రామదాసుది కాకుండా .. 19వ శతాబ్ధం వాడైన వరద రామదాసు వేయించిన శాసనం, అలాగే భక్త రామదాసు కాలానికి చెందిన ముగ్గురు మహిళలు.. ఆలయ మండపాలు, ప్రహారీలు నిర్మించారనే విషయాన్ని తెలిపే శాసనాన్ని మాత్రం కనుకొనగలిగారు. వీటి వివరాలను నాటి మద్రాస్ ప్రభుత్వం 1920, ఆగస్టు నెలలో ‘వార్షిక శిలా శాసన పత్రం’ పేరుతో వెలువరించిన నివేదికలో పొందుపర్చింది. భద్రాచల రాముడిపై విపరీత భక్తిభావం ఏర్పడి కుటుంబ సమేతంగా అతని సన్నిదిలో గడపటం కోసం కంచి నుంచి 19వ శతాబ్ధంలో (బహుశా 1832) తరలివచ్చినవాడే వరద రామదాసు. ఆయన వచ్చేసరికి భక్త రామదాసు కాలంనాటిదిగా భావించే ఒక శాసనం భద్రాచలం Bhadrachalam ఆలయంలో ఉన్నప్పటికీ దానిపై గల అక్షరాలు ధ్వంసమై ఉన్నాయి. ( వెంకోబారావు నివేదికలోని ముఖ్యాంశాలు తదుపరి భాగంలో)

Tags:చలన చిత్రంStory

Recent Posts:

అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను  కాపాడిన  తెలుగు అధికారి
అమెరికా కుట్ర నుంచి రాకెట్ శాస్త్రవేత్తను కాపాడిన తెలుగు అధికారి
బురుజు.కాం Buruju.com భారత్ లో రాకెట్ ప్రయోగాలకు భీజం వేసింది.. ఇస్రో శాస్త...
చలన చిత్రం
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు?  ( అయిదో భాగం)
అల్లూరి అనుచరుడు అగ్గిరాజు ఏమయ్యాడు? ( అయిదో భాగం)
బురుజు.కాం Buruju.com : ( అల్లూరి శ్రీరామరాజు తమ అధీనం నుంచి తప్పించుకొ...
చారిత్రకం
మూడు పార్టీలకు  చెమటలు పట్టించనున్న మునుగోడు
మూడు పార్టీలకు చెమటలు పట్టించనున్న మునుగోడు
బురుజు.కాం Buruju.com : తెలంగాణలో త్వరలోనే మళ్లీ ఎన్నికల వేడి రాజకోబోతోంది...
అవీ ఇవీ
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
భగవద్గీతను అంతిమ యాత్రల్లో వాడకుండా చట్టం తేవాలి
బురుజు.కాం Buruju.com : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భగవద్గీత లక్ష్యం మారిపోతోంద...
సామాజికం
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
ప్రణాళిక సంఘం రద్దువల్లే యధేచ్చగా అప్పులు
బురుజు.కాం Buruju.com : జాతీయ ప్రణాళిక సంఘం రద్దయినప్పటి నుంచి రాష్ట్రాల ...
ఆర్థికం
గవర్నరు  ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
గవర్నరు ఆవేదన నుంచి పుట్టుకొస్తున్న విమర్శలు
బురుజు.కాం Buruju.com : ఎవరైనా కలత చెందుతున్నప్పుడు వారిని అర్ధం చేసుకొన...
అవీ ఇవీ
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
మళ్లీ ఎన్నికల అస్త్రాలుగా రాష్ట్ర విభజన అంశాలు?
బురుజు.కాం Buruju.com : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. రెండు రాష్ట్రాలుగా వ...
అవీ ఇవీ
తెలంగాణలో వరద రాజకీయం
తెలంగాణలో వరద రాజకీయం
బురుజు.కాం Buruju.com : రాష్ట్రాల్లో వరదలు, తుపానులు ఎప్పుడొచ్చినా రాజకీయాల...
అవీ ఇవీ
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
వేశ్యకూ గౌరవం ఉండాలనే గంగుభాయి పోరాటం ఇప్పటికి ఫలించింది
బురుజు.కాం Buruju.com : వ్యభిచారాన్నీ ఒక వృత్తిగా గుర్తించి తమను ఇతరులతో స...
చలన చిత్రం
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
ఏసీబీ ఇనస్పెక్టరుకు నివాళిగా.. ఏడాది తర్వాతా భారీ ప్రదర్శన ! (మూడో భాగం)
(పిళ్లా సాయికుమార్: Buruju.com) ( విజయనగరంలో 1988లో మృతి చెందిన నిజాయితీ ...
రిపోర్టర్ డైరీ
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
తెలంగాణలో ఇక ఇంటింటికి బ్యాంకు సఖి
బురుజు.కాం ( Buruju.com) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇక బ్యాంకింగ్ సేవల...
ఆర్థికం
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
న్యాయవాదితోనే ఇక సామాన్యుడికి ఊరట
బురుజు.కాం Buruju.com : సామాన్యుడికి అండగా ఉండాల్సిన వ్యవస్థలు గాడి తప్పి ...
చలన చిత్రం
అల్లూరిని హతమార్చిన  పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ?  (నాలుగో భాగం)
అల్లూరిని హతమార్చిన పోలీసుల వాంగ్మూలాలు ఎక్కడ? (నాలుగో భాగం)
బురుజు.కాం Buruju.co ప్రతినిధి: (అల్లూరి సీతారామరాజు తమ అధీనం నుంచి తప్ప...
చారిత్రకం
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
జీవిత కాలం.. తెలంగాణకంటే ఏపీలో 6నెలలు ఎక్కువ!
సగటు ఆయుర్దాయం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో కాస్త ఎక్కువగా ఉన్నట్టు వెల్లడయ...
అవీ ఇవీ
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
తెలుగు రాష్ట్రాలు ఎడాపెడా ఓవర్ డ్రాఫ్టు
బురుజు.కాం ప్రతినిధి Buruju.com : ఒోవర్ డ్రాఫ్టు కింద రిజర్వు బ్యాంకు నుం...
ఆర్థికం
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
మనిషిని మార్చుకోవటానికి మరిన్ని ‘జల్లికట్టు’లు
బురుజు.కాం Buruju.com : ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చ...
చలన చిత్రం
About

Buruju.com, the online telugu portal brings you weekly news and views mainly focusing on Social, Financial and Historical events of Andhra Pradesh and Telagana states from Hyderabad, India.

Contact
For Editorial feedback and Marketing Contact:
editor@buruju.com
Quick Links
  • About Us
  • Contact Us
  • Search Buruju

Copyright © 2020 All Rights Reserved by Buruju. Contents of ‘Buruju.com’ are copyright protected. Copy or reproduction or re use of contents or any part thereof is illegal. Such persons will be prosecuted.